బెల్లంపల్లిలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): ఆదిలాబాద్ జిల్లా అమోచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న బెల్లంపల్లి పట్టణంలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి తిలక్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సబ్‌జూనియర్, జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సబ్‌జూనియర్ ,జూనియర్ బాలుర విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. సబ్‌జూనియర్, జూనియర్ బాలికల విభాగంలోకూడా పోటీలు ఉంటాయన్నారు. సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొనేవారు 1998, 1999 సంవత్సరంలో జన్మించినవారై ఉండాలన్నారు. జూనియర్ పోటీల్లో పాల్గొనేవారు 1995 నుంచి 1997 మధ్యలో పుట్టినవారై ఉండాలన్నారు.