బెస్ట్ న్యూరో సర్జన్ అవార్డ్ తీసుకున్న డాక్టర్ మధు బాబుకు సన్మానం

.

హుజూరాబాద్ (జనం సాక్షి): హనుమకొండ న్యూరో సెంటర్ లోని డాక్టర్ మధుబాబు న్యూరో సర్జన్ గారికి గత నెల ఆగస్టు తేదీ.27-08-2022 రోజున హైదరాబాద్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు బెస్ట్ న్యూరో సర్జన్ గా డాక్టర్ మధుబాబును గుర్తించినారు.ఈ అవార్డును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ,ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారి చేతులమీదుగా న్యూరో సర్జన్ డాక్టర్ మధుబాబు బెస్ట్ అవార్డు తీసుకున్నారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డును తీసుకున్న డాక్టర్ మధుబాబు మొదటిసారిగా ఆదివారం రోజున హుజురాబాద్ లోని సూపర్ బజార్ రోడ్ శ్రీరామ పాలి క్లినిక్ కు రావడంతో హాస్పిటల్ యాజమాన్యం నంబి భరణి కుమార్, ముష్కే శ్రీనివాస్ ఆధ్వర్యములో సిబ్బందితో కలిసి శాలువలు కప్పి ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది రాజు, కుమిదిని,రజిత, రాజేష్ ,పవన్ ల తో కలిసి వైద్యులు రఫీ, సతీష్, శ్రీనివాస్ రెడ్డి ,నరేందర్ ,శ్రీకాంత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.