బేగంపేట గులాబీమయం
మహారాష్ట్రతో అంతర్ రాష్ట్ర నీటి ఒప్పందాన్ని వజయవంతంగా పూర్తి చేసుకొని కాసేపట్లో బేగంపేటలో అడుగు పెడుతున్నారు సీఎం కేసీఆర్ చారిత్రక నీటి ఒప్పందంతో తెలంగాణకు వస్తోన్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో భారీగా వచ్చి చేరారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చారు. ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి వందలమంది కళాకారులతో ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం అపర భగీరథుడు అంటూ రైతులు, కళాకారుల ఆటపాటలతో సభ మారుమోగుతోంది.
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు టీఆర్ ఎస్ పార్టీ జెండాలతో కార్యకర్తలు వచ్చి దారి పొడవునా వచ్చి చేరారు. ఎక్కడ చూసిన టీ ఆర్ ఎస్ పార్టీ ప్లెక్సీలు, జెండాలే దర్శనమిస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ ప్రాంగణం అంతా, మంత్రులు, వీఐపీలు, అధికారులతో నిండిపోయింది. ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం నేరుగా క్యాంప్ ఆఫీసు వరకు టీ సర్కార్ విజయ యాత్ర కొనసాగనుంది.