బేనజీర్ హత్యకేసులో ముషారఫ్ పరారీ నేరస్థుడు
ఇస్లామాబాద్,,ఆగష్టు 31,(జనంసాక్షి): పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చిక్కుల్లో పడ్డారు. మాజీ ప్రధానని బేనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ దేశం నుంచి పరారీ అయినట్లు కోర్టు ప్రకటించింది. ఆయనను ప్రకటిత నేరస్థుడిగా పేర్కొంది. బేనజీర్ హత్యకు జరిగిన కుట్ర వివరాలు ముషారఫ్‌కు తెలుసునని వ్యాఖ్యానించింది. ఆమె హత్యలో ఆయన పాత్ర ఉందని కోర్టు నిర్దారించింది. బేనజీర్ హత్యకేసులో మరో ఐదుగురు నిందితులు నిర్దోషులని పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు గురువారం నిర్దారించింది. న్యాయమూర్తి అస్ఘర్ అలీ ఖాన్ అడియాలా జైలులో నాలుగు రోజులుగా
విచారణ నిర్వహించారు. 2007 డిసెంబరు 27న రావల్పిండిలో బేనజీర్ భుట్టో హత్య జరిగింది. ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం బయటికి వస్తుండగా ఆమెపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు.