బొడ్రాయి తండాలో నూతన పింఛన్ల పంపిణీ
డోర్నకల్ అక్టోబర్ 8
ఈరోజు బొడ్రాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లను 31 మందికి అందజేశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కృషితోనే పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. దేశంలో ఉన్న నిరుపేదల అభ్యున్నతికి జాతీయ పార్టీ స్థాపించారని… దీనిని దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగానే దేశాన్ని కూడా ప్రగతి వైపు నడిపిస్తారని వారు అభిప్రాయపడ్డారు. దళిత బంధు, రైతుబంధు, విప్లవాత్మక పథకాలని… తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ పథకాలు అమలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు.. తేజావత్ రాజు నాయక్, ఉపసర్పంచ్ తేజావత్ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బానోతు వెంకన్న, వార్డ్ మెంబర్లు, తోపాటు పెన్షనర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area