‘ బొత్స, బాబు, విజయలక్ష్మిలు ఎందుకు వెళ్లరు’ : తారక రామారావు

హైదరాబాద్‌: తెలంగాణపై పార్టీలు తమ వైఖరి తెలపాలటూ డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేవానికి బొత్స సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబులు ఎందుకు వెళ్లరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఐదు పార్టీలు టీఆర్‌ఎస్‌, సీపీలు, సీపీఎం, బీజేపీ, ఎంఐఎంల తరపున ఆపార్టీల అధినేతలు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారాయణ, రాఘవులు, కిషన్‌రెడ్డి, అసదుద్దీన్‌లు హాజరవుతున్నపుడు పీసీసీ చీఫ్‌గా బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మిలు ఎందుకు హాజరుకారపి ఆయన నిలదీశారు.

తెలంగాణను గౌరవిస్తున్నమని, వ్యతిరేకించమని చెప్పిన మాటలల్లో నిజముంటే ఈ ముగ్గురు అఖిలపక్షానికి హాజరుకావాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు . లేకుంటే వీరంతా తెలంగాణ చరిత్రలో శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర పార్టీల్లో ఉన్న తెలంగాణవాదులు తమ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు ఆంధ్రాబాబు అనిపించుకున్నడు : కేటీఆర్‌

జేఏసీ నేతలు జై తెలంగాణ అనుమంటే అనకుండా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆంధ్రాబాబు అని రుజువు చేసుకున్నాడని కేటీఆర్‌ విమర్శించారు.