బొమ్మకారు రిమోట్‌తో ‘బోస్టన్’ పేలుళ్లు
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో మారథాన్ పరుగు జరుగుతున్నప్పుడు నిందితులు ఒక బొమ్మకారు రిమోట్ సాయంతో బాంబులు పేల్చారని ,ఉగ్రవాద సంస్థ ‘ఆల్‌కాయిదా’ ఆన్‌లైన్ పత్రిక ద్వారా వారు ప్రెషర్‌కుక్కర్ బాంబు తయారీ విదానాన్ని తెలుసుకుని ఉంటారని మేరిలాండ్ ప్రతినిది డచ్ రూపర్స్‌బెర్గర్ తెలిపారు. సీనీయర్ జాతీయ భధ్రతాదికారులు ముగ్గురితో కేపిటల్ హిల్‌లో జరిగిన బేటి అనంతరం ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
కాగా, బోస్టన్ పేలుళ్ల సంఘటనను అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ పిరికిపంద చర్యగా అబివర్ణించారు.అమెరికన్లను భయాందోళనలకు గురిచేసేందుకు విఫలయత్నం చేసిన జీహదీలను తరిమికొట్టాలని ఈయన పిలుపునిచ్చారు.బోస్టన్ పేలుళ్ల కేసులో నిందితులైన చెచెన్ సోదరుల్లో టమెర్లాన్ త్సర్నేవ్ పోలీస్ కాల్పుల్లో మరణించగా,ద్జోఖర్ త్సర్నేవ్ ఆ తర్వాత
పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే,కాగా, రష్యాలో ఉంటున్న వారి తండ్రి త్వరలో అమెరికి రానున్నాడని,దర్యాప్తుకు పనికి వచ్చే కీలకమైన సమాచారాన్ని అతడు తీసుకురావచ్చని అమెరికన్ మీడియా పేర్కోంది.ఇదిలా ఉండగా,బోస్టన్ పేలుళ్లకు సంబందించిన అన్ని ప్రశ్నలకు తమ వద్ద సమాదానాలు లేవని వైట్‌హౌస్ తెలిపింది.ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తయ్యేందెకు మరికొంత కాలం పట్టవచ్చని పేర్కోంది.