బోగీలో చెలరేగిన మంటలు..

2

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోకోషెడ్‌లో ఉన్న రైలు ఓ బోగీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటికే ఆ బోగిలోని ఫర్నీచర్, సీటింగ్ 70శాతం దగ్దమయ్యింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫుట్ పాత్ పైన నివసించే వ్యక్తులెవరైనా ‘బీడీ’తాగి వేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.