బోధ రహిత సమాజానికి కృషి చేయాలి: డా.లక్ష్మీప్రసన్న

అనంతగిరి జనంసాక్షి:
బోధ వ్యాధి రహిత సమాజానికి కృషి చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం వైద్యురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న అన్నారు.మంగళవారం అనంతగిరి మండల పరిధిలోని అంగన్వాడి,ఆరోగ్య,ఆశా కార్యకర్తలకు బోధ వ్యాధిపై అవగాహన కల్పించి మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డిఇసి,ఆల్బెండజోల్ మాత్రలు మింగాలని వారు కోరారు.మాత్రలు మింగడం వల్ల వంద శాతం బోదరహిత సమాజానికి మన వంతుగా కృషి చేయవచ్చని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాగ మౌనిక,కళావతి,విజయ్ కుమార్,శైలజ,మహేష్,మంజుల,రాధా,శ్రీదేవి,మంగ,మహేశ్వరి,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area