బోధ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

–  జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అన్ని శాఖల సమన్వయంతో బోధరహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో బోధ మాత్రల పంపిణీ కార్యక్రమంపై జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2306 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో,సుమారు పదిమంది ప్రత్యేక అధికారుల సమన్వయంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ ప్రతి ఒక్కరూ డిఈసి, ఆల్బెండజోల్ మాత్రలు మింగే విధంగా నేటి నుంచి బోధకాలు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో దాదాపు 5271 కేసులు ఉన్నట్లు, అందులో 2300 మంది తెలంగాణ ప్రభుత్వం తరఫున పెన్షన్ అందుకున్నట్లు చెప్పారు.డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం మాట్లాడుతూ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలిపారు.ప్రత్యేక డిఈసి,ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు, అంగన్వాడి కార్యకర్తలు , స్వచ్ఛంద సహాయకులు పాల్గొంటున్నట్లు చెప్పారు.ఒక్కసారి డిఈసి మాత్ర మింగడం వల్ల 100శాతం బోదకాలు నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు.కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ నాజియా మాట్లాడుతూ బోధవ్యాధి కలుగజేయు దోమల పెరుగుదల వల్ల కొన్ని ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, దీనిని అరికట్టేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుని పారిశుధ్యం మెరుగుపడేలా చూడాలని అన్నారు.వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాత్రలు మింగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నిరంజన్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ చంద్రశేఖర్ , డాక్టర్ జయ, మాస్ మీడియా అధికారి అంజయ్య , కిరణ్, అరుణ , కృష్ణమూర్తి , దయానంద రాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area