బోస్టన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కాల్చివేత
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతుకు ముందు ఇద్దరు వ్యక్తులు ‘మిట్’ క్యాంపన్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళ సిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు. దుండగులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో వ్యక్తి పారిపోయాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తిని బోస్టన్ మారథాన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.