బోస్ మరణం మిస్టరీ వీడే అవకాశం
– పలు కీలక రహస్య పత్రాలు ప్రజల ముందుకు
కోల్‌కతా,సెప్టెంబర్18(జనంసాక్షి):
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మరణానికి లేదా అ దృశ్యానికి సంబంధించి అనుమానాలను ని వృత్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వ చ్చింది. దీనికి సంబంధించిన పలు ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిం ది. ముందుగా నేతాజీ కుటుంబ సభ్యుల కు అధికారులు ఫైళ్లు అందజేశారు. 64 ఫైళ్లైను ప్రజల సందర్శనార్థం కోల్‌కతా పోలీస్ మ్యూ జియంలో ప్రభుత్వం ఉంచింది. సోమవారం నుంచి ప్రజలందరికీ నేతాజీ రహస్య ఫైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని బెం గాల్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసి డీవీడీల రూ పంలో కూడా విడుదల చేసింది. డీవీడీ రూ పంలో ఉన్న వాటిని నేతాజీ కుటుంబ సభ్యు లకు అందజేసింది. 12744 పేజీలతో కూ డిన మొత్తం 64 ఫైళ్లను కోల్‌కతాలోని డీజీపీ కార్యాలయంలో ఉంచారు. సోమవారం నుంచి పోలీస్ మ్యూజియంలో ప్రజల సందర్శ నార్థం
ఉంచనున్నారు. 1937 నుంచి 47 వరకు జరిగిన నేతాజీకి సంబంధించిన అంశాలు ఈ ఫైళ్లలో ఉన్నట్లు సమాచారం. సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న సందిగ్ధత ఈ ఫైళ్లతో తొలగిపోయే అవకాశముంది. బోస్ మరణించారా? లేదా బతికే ఉన్నారా? అనే విషయంపై స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం 3 కవిూషన్‌లను వేసింది. కానీ ఏ ఒక్క కమిటీ నివేదికలో ఈ అంశంపై స్పష్టత లేదు. 1945 ఆగస్టులో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోనావాజ్ కవిూషన్ నిర్థారించింది. 1970లో ఏర్పాటైన జీడీ కోస్లా కవిూషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. నేతాజీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రెండు కవిూషన్‌లు వాస్తవాలను వెల్లడించడంలేదంటూ నేతాజీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా ఎన్డీయే ప్రభుత్వం నెహ్రుకు సంబంధించి బయటపెట్టిన నివేదిక కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. నేతాజీ చనిపోయారని ప్రకటించిన తర్వాత కూడా నెహ్రు నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టారన్నది ఆ నివేదిక సారాంశం. ఏదేమైనా బెంగాల్ ప్రభుత్వం ఈ ఫైళ్లను విడుదల చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే కోల్‌కత్తా పోలీస్ మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సందర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైళ్లను ఆమె పరిశీలించారు. ఇందులో ఉన్న విషయాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో తాము రహస్యానలు వెల్లడించామని అన్నారు.