బ్ర¬్మత్సవాలకు తిరుమల ముస్తాబు

విఐపి బ్రేక్‌ దర్శనాల నిలపివేత
తిరుమల,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్ర¬్మత్సవాలకు రంగం సిద్దమయ్యింది. నెల వ్యవధిలో రెండోసారి బ్ర¬్మత్సవాలు రావడంతో దసరా నవరాత్రి బ్ర¬్మత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశారు.   వైఖానస ఆగమ మోక్తంగా  వేడుక నిర్వహించి బ్ర¬్మత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. బ్ర¬్మత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 8 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనం (పెద్దశేషవాహనం)పై తిరుమల మాడవీ ధుల్లో భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు.  ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని టిటిడి అధికారులు చెప్పారు. ఈనెల 10నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ఆరో రోజు(15న) సాయంత్రం పుష్పక విమానం, 8వ రోజు(17న) ఉదయం స్వర్ణరథంలో స్వామివారు ఊరేగుతారని చెప్పారు. ప్రధానమైన గరుడసేవ 14 న(ఆదివారం) ఉంటుందని, పెరటాసి నెల నాలుగో శనివారం కావడంతో ఈ రెండు రోజుల్లో భక్తులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్సవాల రోజుల్లో ప్రొటోకాల్‌ ప్రముఖులకు ఒకసారే వీఐపీ బ్రేక్‌ కేటాయిస్తామని తేల్చిచెప్పారు.10, 14 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దు చేశామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రూ.300 టికెట్లను తొలి 4 రోజుల్లో 12వేలు, చివరి 4 రోజుల్లో 7వేలు చొప్పున మాత్రమే విక్రయించామని వివరించారు.13, 14 తేదీల్లో నడకదారి దివ్యదర్శనం, స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లను జారీ చేయబోమని, ఆ రెండు రోజుల్లో భక్తులందరూ సర్వదర్శనం ద్వారానే స్వామిని దర్శించుకోవాలని జేఈవో విజ్ఞప్తి చేశారు.