బ్ర¬్మస్‌ ఎఫెక్ట్‌.. 

– సైనికుడిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌
విూరట్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : బ్ర¬్మస్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసేందుకు సహకరించారనే ఆరోపణలతో భారత ఆర్మీలో పని చేస్తున్న ఓ సైనికుడిని బుధవారం విూరట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) అదుపులోకి తీసుకుంది. భారత్‌కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఆ జవాను పాకిస్థాన్‌ ఇంటర్‌సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కి చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడిని విూరట్‌లోని ఆర్మీ సిగ్నల్‌ రెజిమెంట్‌కు తరలించి విచారిస్తున్నారు. జవానుతో పాటు మరికొంతమందిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్ర¬్మస్‌ గూఢచర్యం కేసుకు సంబంధించిన ఏటీఎస్‌ అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆగ్రా, కాన్పూర్‌ ప్రాంతాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను ఏటీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై స్పందించేందుకు ఏటీఎస్‌ అధికారులు నిరాకరించారు. గూఢచర్య ఆరోపణలపై బ్ర¬్మస్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరు నిశాంత్‌ అగర్వాల్‌ను ఈనెల 8న ఏటీఎస్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బ్ర¬్మస్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. నాగ్‌పూర్‌లోని బ్ర¬్మస్‌ కార్యాలయంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం నుంచి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో కొన్ని రహస్య పత్రాలు ఉన్నట్లు లఖ్‌నవూలోని ఏటీఎస్‌ వర్గాలు తెలిపాయి.