బ్రసస్సెల్స్‌లో సాధారణ పరిస్థితులు

బ్రస్సెల్స్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  ఆత్మాహుతి దాడులతో మూతపడిన బ్రస్సెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పుఉడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. గతంతో పోలిస్తే భద్రతను పెంచి, తనిఖీలు ముమ్మరం చేశారు. గత నెల 22న జరిగిన ఆత్మాహుతి దాడుల అనంతరం విమానాశ్రయంలోని పలు విభాగాలు మూతపడిన విషయం తెలిసిందే.  ఈ దాడుల తరువాత ఆదివారం నాడు తాత్కాలికంగాఏర్పాటు చేసిన చెకిన్‌ తదితర ఏర్పాట్లతో పరిమిత సామర్ద్యంతో విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలను పున్ణప్రారంభించారు. నామమాత్రంగా ఫారో, ఏథెన్స్‌, ట్యురిన్‌ నగరాలకు విమాన సర్వీసులతో విమానాశ్రయాన్ని పున్ణప్రారంభిస్తున్నట్లు బ్రస్సెల్స్‌ విమానాశ్రయ ప్రధానాధికారి ఆర్నాడ్‌ ఫీస్ట్‌ వివరించారు. పోలీసుల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణీకులను బయల్దేరే సమయానికి మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తొలి విమానం ఫారో నగరానికి బయల్దేరి వెళ్లింది. దాడుల్లో దెబ్బతిన్న భాగాల పునర్నిర్మాణానికి కనీసం మూడు నెలలు పడుతుందని వివరించారు. నగరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పోలీసులు అలర్ట్‌ అయ్యారు.అనుమానితులను ఒకటికి రెండుసార్లు ప్రశ్నిస్తున్నారు.