బ్రిటన్‌లో ఒమిక్రాన్ కల్లోల్లం
భారీగా పెరుగుతున్న కేసులు
అప్రమత్తం అయినా బొరిస్ ప్రభుత్వం
లండన్,డిసెంబర్16( జనం సాక్షి): బ్రిటన్‌లో కరోనా కల్లోల్లం సృష్టిస్తోంది. కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు ఎక్కువ. రాబోయే కొద్ది రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఉండవచ్చునని బ్రిటన్ సీనియర్ హెల్త్ చీఫ్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 67 మిలియన్ మంది ప్రజలు ఉండగా.. ఇప్పటి వరకు 11 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నూతన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా దేశంలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ మరో వేవ్ మొదలైందంటూ హెచ్చరించారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. 10 మంది ఆసుపత్రిలో చేరగా.. ఒకరు మృతి చెందినట్లు ప్రధాని స్వయంగా ప్రకటించారు.కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు ఎక్కువ. రాబోయే రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఉండవచ్చునని బ్రిటన్ సీనియర్ హెల్త్ చీఫ్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 67 మిలియన్ మంది ప్రజలు ఉండగా..
ఇప్పటి వరకు 11 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నూతన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా దేశంలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ మరో వేవ్ మొదలైందంటూ హెచ్చరించారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. 10 మంది ఆసుపత్రిలోచేరారు? ఒకరు మృతి చెందినట్లు బ్రిటన్ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.