బ్రిటన్ కుర్రాడికి ‘ఐ’ చేయి
స్మార్ట్ ఫోన్ సహయంతో పని
లండన్,ఏప్రిల్ 24 : చిన్నపుడే జబ్బునపడి ఒక కాలు,ఒక చేయి పోగొట్టుకున్న బ్రిటన్ కుర్రాడు ప్యాట్రిక్ కేన్ (16)కు చెయ్యి లేని లోటు తీరిపోయింది.స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (ఐ-లింబ్) సహయంతో నడిచే అత్యాధునిక కృత్రిమ చేతిని అతనికి అమర్చారు.
ఇలాంటి చేతిని అమర్చడం బ్రిటన్‌లో ఇదే మొదటిసారి.ఐఓఎస్ అప్లికేషన్ ఉన్న ఫోన్‌నే రిమోట్‌లాగా వాడవచ్చు.కృత్రిమ చెయ్యి మామూలు చేతితో సమానంగా పని చేస్తుంది.’ఐ-లింబ్ అల్ట్రా రెవెల్యూషన్’ ఫోన్‌ను స్కాట్లాండ్‌కు చెందిన ‘టచ్ బయోనిక్స్’ తయారు చేసింది.ఈ చేతి వేళ్లతో చిన్న మాత్ర నుంచి క్రికెట్ బంతిని కూడా పట్టుకోవచ్చు.మొత్తం 24 రకాల ‘పట్లు’ పట్టొచ్చు.