-->

బ్రిడ్జ్ నిర్మించండి అంటు యువకుల సాధన దీక్ష,,,

 

ఈ సారి వెనకడుగు వేసేదే లేదు గ్రామస్తులు

ఇచ్చిన హామీలను వెంటనే త్వరితగతిన పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలు పెట్టటానికి హామీ వచ్చేంత వరకు మా దీక్ష కొనసాగుతది :-గ్రామస్తులు,

జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీక్ష విరమింపజేసేది లేదు ,గ్రామస్తులు

కొమురంభీం జిల్లా:చింతలమనేపల్లి మండలం లోని దిందా గ్రామానికి చెందిన వాగు చిన్నపాటి వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తుంది రాక పోకలకు అంతరాయం కలుగుతుంది, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ,గత నెలలో కొన్ని రోజులుగా దిందా గ్రామం జలదిగ్బంధం లో దాదాపుగా 18 రోజుల నుండి ఇరవై రోజుల పాటు ఉంది, పంటలు పొలాలు జలదిగ్బంధం అయ్యాయి పంట నష్టం వాటిల్లింది,గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలిగింది,,

గత సంవత్సరం లో యువకులు గ్రామస్తులంతా కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ వారం రోజుల పాటు సాధన దీక్ష చేసినప్పటికీ స్థానిక ఎంపిడివో, జె,ఈ వచ్చి యువకులకు గ్రామస్తులకు డిసెంబర్ కల్లా పనులు చేపడతామని నచ్చజెప్పి దీక్షను విరమింపజేశారు, వారు చెప్పి ఏడాది కావస్తున్నా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు, అధికారులు మా గొడుని పట్టించుకోకుండా మాకు ఈ సమస్యా పై స్పందన లేని కారణంగా మళ్ళీ మేము దీక్షని కొనసాగిస్తున్నట్లుగా గ్రామస్తులు అన్నారు,ఈ సారి అటవీ అధికార్లు ,జిల్లా కలెక్టర్ వచ్చి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కాంట్రాక్టర్ కి చెప్పేంత వరకు దీక్ష విరమింపజేసేది లేదంటూ యువకులు గ్రామస్తులు అన్నారు,,