బ్రిలియంట్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

-మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.
– కరస్పాండెంట్ అప్పారావు.

డోర్నకల్,అక్టోబర్ 13,(జనం సాక్షి న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బ్రిలియన్స్ పాఠశాలలో శుక్రవారం తెలంగాణ సంప్రదాయాలతో బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మ ముందస్తు సంబరాలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి,వాటిని ఆచరించి అంతరించిపోకుండా ముందు తరాలకు అందివ్వాలని ఆయన సూచించారు.కాగా అంతకుముందు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సమావేశానంతరం భక్తి ప్రపత్తులతో పాటలు పాడి,ఆటలు ఆడి బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ పాఠశాల ప్రిన్సిపాల్ అప్సర్ బేగం, ఉపాధ్యాయులు శ్రీనివాస్, చిట్టి బాబు, స్వప్న,రమ్య,నాగరాజు,బద్రు, సైదులు, పద్మాలత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.