బ్రెజిల్‌లో అవినీతిపై ఉధృత పోరు
బ్రెసీలియా (బ్రెజిల్):దేశంలొని 12 రాష్ట్రాల్లో వేళ్లూనుకు పోయిన అవినీతి నెట్‌వర్క్‌లను కూకటి వేళ్లతో పెకలించివేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ఉధృత పోరాటాన్ని ప్రారంభించింది. దాదాపు 3 లక్షల మంది సైనిక, పోలీసు దళాలు, కంప్ట్రోలర్ జనరల్, 158 మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బృందాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత అవినీతిపరులుగా గుర్తించిన 92 మంది వ్యక్తులను పట్టుకునే లక్ష్యంతో 337దాడులు నిర్వహించాయని ఫెడరల్ ప్రభుత్వ న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగులపై సైతం ఈ దళాలు కోరడా ఝళిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈదళాలు జరిపన దాడుల్లో 68కేసుల్లో ఆస్తులను స్వాధీనం చేసుకుని 20మంది ప్రభుత్వోద్యోగులను డిస్మిస్ చేసినట్లు ఈ వర్గాలు వివరించాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, లంచగోండితనం, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి మార్గాలలో ఈ వ్యక్తులు అవినీలి సంపాదన కూడబెట్టారని తెలిపాయి.