బ్లాక్‌డే విరమించుకున్న డిఎంకె

 

చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): తమిళనాట వరదల కారణంగా డిఎంకె అనూహ్యనిర్ణయం తీసుకుంది. బ్లాక్‌డే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు డీఎంకే వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోదీ చెన్నై పర్యటనలో భాగంగా డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన మరుసటి రోజే నిరసన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం

గమనార్హం. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరదల కారణంగానే నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపాయి. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నవంబర్‌ 8న బ్లాక్‌డేగా నిర్వహించాలని ప్రతిపక్షాలు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజున దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. కానీ ప్రస్తుతం డీఎంకే నిరసన కార్యక్రమాలను రద్దు చేసుకుంది.