భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తజనంతో పోటేత్తింది. శ్రావణ మాసంలో చివరి మంగళవారం కావడంతో పాటు పంద్రాగస్టు విద్యాసంస్థలకు సెలవు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం 4.30గంటల నుంచే ఆలయాన్ని తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. ఉచిత, ప్రత్యేక దర్శనానికి భక్తులు గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది. పలువురు దంపతులు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించారు. ఆలయ ఏఈ అమరేందర్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌ పర్యవేక్షణలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూశారు. ప్రముఖల పేరుతో వచ్చే భక్తులకు ప్రత్యేక ద్వారం వద్ద ఉచిత దర్శనానికి అనుమతించక పోవడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు తప్పాయి. శని, ఆది, సోమవారాల్లో వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.12లక్షల ఆదాయం సమకూరగా, ఒక్క మంగళవారంనాడే రూ.6 లక్షలకు పైగా ఆలయానికి ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు.