భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారు

వైభవంగా పండుగ మహోత్సవం

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

విశాఖపట్నం ఫిబ్రవరి..15(జనంసాక్షి బ్యూరో ): పరవాడ మండలం, వాడచీపురుపల్లి తో పాటు దళాయపాలెం , పరిసర గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత శ్రీ రామచంద్ర అమ్మవారి తల్లి పండుగ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.. ప్రతి ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ పండుగ మహోత్సవం ను ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత ఘనంగా జరిపించారు.. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి, ఆరాధన గావించారు అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.. తదుపరి క్యూ లైన్లులో భక్తులందరికీ అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు…. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ రామచంద్ర అమ్మవారు తల్లి అత్యంత మహిమాన్వితంగా పేర్కొన్నారు.. మనసులో సంకల్పం అమ్మవారికి తెలియజేస్తే తప్పకుండా వారు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీను బాబు అభివర్ణించారు..