భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి మాధవి

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు హైకోర్టు న్యాయమూర్తికి ప్రత్యేక స్వాగతం పలికారు. అదే విధంగా అర్చనలు చేసి ఆశీర్వదించారు. కుటుంబ సమేతంగా వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి మాధవికి భద్రకాళి అమ్మవారి ఆలయ విశిష్టత ప్రత్యేకత గురించి అర్చకులు వివరించారు. అలాగే అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శేషు భారతి అర్చక బృందం పాల్గొన్నారు.