భద్రతాలోపాలు నిజమే..
– పఠాన్ కోట్ ఆపరేషన్ పూర్తి కాలేదు
– ఏయిర్‌బేస్‌ను సందర్శించిన పారికర్
న్యూఢిల్లీ,జనవరి 5(జనంసాక్షి): ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్న పఠాన్ కోట్ ఏయిర్‌బేస్‌లో భద్రతాలోపాలు వాస్తవమేనని, దీనిపై విచారణకు ఆదేశిస్తామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం ఆయన పఠాన్ కోట్ ఏయిర్‌బేస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. రక్షణ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదన్నారు. ఆపరేషన్ ముగింపు విషయంలో ఎన్‌ఎస్‌జీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. కాల్పులు జరిపిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి యత్నించిన ఆరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేయకుండా అక్కడే పేల్చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గ్రెనేడ్లు నిర్వీర్యం చేస్తూ ఇప్పటికే ఒక అధికారిని కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పారికర్ తెలిపారు. భద్రత విషయంలో సైనికులు రాజీ పడలేదన్నారు. పఠాన్‌కోట్‌లో సైనిక కార్యాచరణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే మధ్యాహ్నం వైమానిక స్థావరంలో మళ్లీ పేలుడు సంభవించింది. అయితే కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా సిబ్బంది పేలని గ్రెనేడ్లను పేల్చేసినట్లు సమాచారం. వైమానిక స్థావరం 2వేల ఎకరాల్లో ఉండడంతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై 24 గంటల్లో నివేదిక అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ¬ంశాఖ ఆదేశించింది. కూంబింగ్‌లో భాగంగా భద్రతా సిబ్బంది మూడు బాంబులను నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల డీఎన్‌ఏ శాంపిళ్లను భద్రపరిచారు. పఠాన్‌కోట్‌లో భద్రత విషయమై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐబీ చీఫ్ కూడా హాజరయ్యారు. ఇదిలావుంటే
ఉగ్రవాదులు భారత్‌పై పగ తీర్చుకోవాలనుకుంటున్నారని వారి చెర నుంచి బయటపడిన రాజేశ్ వర్మ చెప్పారు. ఇటీవల పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి వదిలేసిన సంగతి తెలిసిందే. ఎస్పీతోపాటు నగల వ్యాపారి అయిన రాజేశ్ వర్మని కూడా ఉగ్రవాదులు అపహరించారు. ఈరోజు ఆయన విూడియాతో మాట్లాడారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురుకి భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ఉగ్రవాదులు భారత్‌పై పగ తీర్చుకోవాలనుకుంటున్నారని, ఆ విషయం తనకు చెప్పారని రాజేశ్ తెలిపారు. వాళ్లు మొత్తం నలుగురు ఉన్నారని.. వారి వయసు 18 – 21 సంవత్సరాల మధ్య ఉంటుందని ఆయన చెప్పారు. తాను కారు నడుపుతున్న సమయంలో మిలిటరీ దుస్తుల్లో ఉన్న నలుగురు ఉగ్రవాదులు వచ్చి తమ కారును అడ్డుకున్నారన్నారు. అమృత్‌సర్ విమానాశ్రయం ఎంత దూరమని అడిగారని.. వారి వద్ద జీపీఎస్ కూడా ఉందని.. దాంతో వాళ్ల కమాండర్ ఆదేశాలను అనుసరిస్తున్నారని రాజేశ్ పేర్కొన్నారు. తన దగ్గర నుంచి రూ.2000 నగదు కూడా తీసుకున్నారని.. ఎనర్జీ డ్రింక్, చాక్లెట్లు కావాలని డిమాండ్ చేశారని ఆయన చెప్పారు.
పఠాన్‌కోట్‌లో కొనసాగుతున్న కూంబింగ్
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులవేట పూర్తయ్యింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. దీంతో మంగశారం సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది జల్లెడ పడుతున్నారు. నాలుగోరోజులుగా పఠాన్‌కోట కాల్పులతో మార్మోగింది. సోమవారం రాత్రి వరకు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. వైమానిక స్థావరం మొత్తం క్షుణ్ణంగా గాలించి… పూర్తి సురక్షితంగా ఉందని ధ్రువీకరించే వరకు కూంబింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కమాండోలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఐఏఎఫ్ హెలికాప్టర్ల సాయంతో గాలింపు కొనసాగింది.
పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై అమెరికా స్పందన
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై అమెరికా స్పందించింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం అందరికీ సవాలు విసురుతోందన్న అమెరికా…దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. మరోవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిని పాకిస్థాన్ విదేశాంగశాఖ ఖండించింది. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
హరిద్వార్‌లో భద్రత కట్టుదిట్టం
మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఆర్ధ్‌కుంభమేళా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన దరిమిలా, మరికొందరు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో హరిద్వార్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్ధ్‌కుంభమేళా జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. కుంభమేళాకు దాదాపు 5కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం హరీష్ రావత్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు భారీగా పోలీసు బలగాలను నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిఘాకోసం డ్రోన్లు, సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.