భద్రత నియమాలుపాటించి ప్రమాదాలు నివారించాలి
సుల్తానాబాద్, జులై 25 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భద్రత నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ డ్రైవర్లకు సూచించారు. బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూని యర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్,ఎలిగేడు,శ్రీరాంపూర్,ఓదెల మండ లాలకు చెందిన ఆటో డ్రైవర్లకు భద్రత ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతు డ్రైవర్లు,డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇన్సురెన్స్ తప్పకుండా కల్గిఉండాలని మద్యం సేవించి సెల్‌ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని వాహనాల్లో ఓవర్‌లోడ్ వెల్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగు తున్నాయని వీటిని నివారించేందుకు నిర్లక్ష్యం చూపవద్దని ఆయన తెలిపారు. అలాగే సీఐకరుణాకర్‌రావు మాట్లాడుతు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు నష్టపోతున్నారని కల్లముందే ప్రమాదాలు జరుగుతే డ్రైవర్లు మానవత దృక్పదంతో ఆసుపత్రులకు తరలించాలని అన్నారు. మోటర్‌వె హికిల్ ఇన్స్‌పెక్టర్ వేణు మాట్లాడుతు లైసెన్స్ లేకుండా కార్యాలయానికి నేరుగా వస్తే ఇప్పిస్తామన్నారు.అలాగే ఐసోటీఎం అధ్యక్షుడు ఘన్‌శ్యాం కలపత్రాలను పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లేక్సీలకు డీఎస్పీ లక్ష్మీనారయణ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సీఐకరుణాకర్, ఎస్సై జగదీశ్, ట్రేనింగ్ ఎస్సై నాగేశ్వర్‌రావు, పోలీస్‌సిబ్బంది,డ్రైవర్లు పాల్గొన్నారు.