భద్రాచలంలో అటవీశాఖ ఉద్యోగి హత్య
భద్రాచలం : అక్రమసంబందం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగి దెవ్‌సింగ్‌ను కొందరి గుర్తు తెలియని వ్వక్తులు హత్యచేశారు. హతుని బంధువుల కథనం ప్రకారం గురువారం అర్థరాత్రి పట్టణంలోని రిక్షా కాలనీలో ఇంటివద్దనున్న సింగ్‌ను అదె కాలనీకి చెందిన కొందరు, బయటకు తీసుకువెళ్లి చంపి వేసినట్టు తెలిపారు. సంఘటనాస్థలానికి పోలీసులు. అటవీశాఖ అధికార్లు చేరుకొని విచారణ చేపట్టారు.