భద్రాచలంలో ఘోర ప్రమాదం

5
బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పడిపోయిన బస్సు

ఇద్దరు మృతి, 36 మందికి గాయాలు

ఖమ్మం,మే21(జనంసాక్షి): భద్రాచలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న ఉన్న ఆర్టీసీ బస్సు భద్రాచలం వద్ద వంతెన పైనుంచి గోదావరిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సారపాక నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వంతెన ఎక్కే సమయంలో ఎడమవైపు వేగంగా దూసుకెళ్లి తలకిందులుగా నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద వార్త తెలియగానే స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బస్సులో 30 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన కొందరిని వెలికితీసి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన బి. శ్రీవాణి(30) ప్రమాదంలో  మృతిచెందారు. భద్రాచలం వద్ద  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నదిలోకి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మంత్రి మహేందర్‌ రెడ్డి కలెక్టర్‌ ఆర్డీవోలతో మాట్లాడారు. తోణం సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్రగ్భ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే బస్సు పూర్తిగా తొలగిస్తే తప్ప మృతుల సంఖ్య తెలియదని స్థానిక అధికారులు తెలిపారు.