భద్రేశ్వరాలయంలో సామూహిక లింగాభిషేకం
రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు మీదుగా సోమవారం సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. ఇక్కడి లింగాయతులు తమ లింగాలను స్వామి చేతుల మీదుగా పాలతో అభిషేకం చేయించుకున్నారు. ఈ సందర్భంగా సద్గురు భక్తులకు లింగాభిషేకం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శి గాజుల శాంతుకుమార్, న్యాయవాది గుండప్ప, మహిళలు తదితరులు పాల్గొన్నారు.