భవన నిర్మాణ కార్మకుల అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్14
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల అడ్డాలపై మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు మల్కాజిగిర సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి సమస్యలపై డిప్యూటీ కమిషనర్ రాజు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ బంగారు నర్సింగ రావు మాట్లాడుతూ.భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక పనులు లేక ఉపాధి అవకాశాలు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణ ఉపాధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి అడ్డా కార్మికులకు కనీసం ఏడాదిలో 150 రోజులు పని కల్పించలని డిమాండ్ చేశారు.పని కోసం అడ్డాల వద్ద మహిళలు,పురుషులు పెద్ద సంఖ్యలో పని కోసం గంటల తరబడి నిలబడుతున్నారని,అడ్డాల వద్ద కనీస మౌలిక సదుపాయా లైన షెడ్ నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం,ఐదు రూపాయల భోజనం మరియు టాయిలెట్స్ నిర్మాణం చేసి కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని అన్నారు.సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన అనేక పథకాలను ప్రభుత్వము నిర్వీర్యం చేస్తుందని బోర్డులో ఉన్న నిధులు కార్మికులకే ఖర్చు చేయాలని అడ్డాలపై లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి కార్మికునికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో యాదగిరి,కృష్ణ,నాగప్ప,నరసింహులు,భాష,ఉలిగప్ప,వీర,నరసింహ,నాగరాజు,షహీన్ భాష,ఉదయ్,అంజి,శ్రీను,భారతి తదితరులు పాల్గొన్నారు.