భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులు…

ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ గరబోయిన భాగ్యలక్మి…

 

బచ్చన్నపేట సెప్టెంబర్ 30
(జనంసాక్షి )

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో స్కూలు వద్ద భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల ఉచిత శిక్షణ శిబిరమును శుక్రవారం రోజున జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య, గోపాల్ నగర్ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ శిక్షణ సమయంలో పాల్గొన్న వారికి వేతనంతో పాటు శిక్షణ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వబడునని ట్రైనర్ టి వేణుగోపాల్ తెలిపారు.
ఈ శిక్షణ శిబిరంలో 30 మంది పాల్గొన్నారు