భవానీ మాత అలంకరణలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం భద్రకాళి అమ్మవారిని భవాని మాత అలంకరణలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ హాజరయ్యారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శేషు భారతి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఇతర అర్చక బృందం భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారిని వరంగల్ నగర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు.