భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మిర్యాలగూడ. జనం సాక్షి

భువనగిరి మండల కేంద్రంలో నిర్వహించినబడుతున్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో సంభాషించి వారి యొక్క సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఐర్ప్ కె. ఎస్తేర్ రాణి తయారు చేసిన లోకాస్ట్ , నోకాష్ట్ మెటీరియల్ ను కలెక్టర్ పరిశీలించారు. వాటిని చూసి కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ తయారు చేసిన వారిని అభినందించారు . ఇది చాలా మంచి ఆలోచన అని లాక్ డౌన్ సమయంలో పిల్లలకు వీడియో ల ద్వారా యాక్టివిటీ లను చేయించిన విధానం పిల్లల తల్లిదండ్రులను ఒక వాట్సప్ గ్రూప్ ద్వారా వారికి అందించిన సేవలను అభినందించారు. సెంటర్ లో తర్పిదు పొంది సాధారణ పాఠశాలలో సమ్మే లితమైన విద్యను పొంది ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కలిగిన విద్యార్థులు నరాల మధు, నాంపల్లి సాయి, ల విజయ గాధలను చూసి వారిని ఈ స్థాయిలో చూడడం ఎంతో గొప్ప విషయమని వీరు అందరికీ ఆదర్శం అని కలెక్టర్ అభివర్ణించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిల్లలకు డ్రాయింగ్ బుక్స్, క్రేయన్స్, మొదలగు వాటిని బహూకరించారు.
ఐర్ప్ ల సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్య శాఖ అధికారి నారాయణ రెడ్డి, ఐఈ కో ఆర్డినేటర్ జోసెఫ్, ఎం ఈ ఓ లక్ష్మి నారాయణ, ఐర్ప్ కే.ఎస్తేర్ రాణి, కే.కిరణ్ కుమార్, కేర్ గివర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

.

తాజావార్తలు