భవిష్యత్‌ అంతా సైన్స్‌దే

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌ పాత్ర కీలకం
కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి
విజయవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): రాబోయే రోజుల్లో భవిష్యత్‌ అంతా సైన్స్‌దేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారతదేశం పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. జాతీయ సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతదేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి బలమైన పునాదులు ఉండేవి. ఈ రంగంలో ఇండియా పాత్ర చాలా కీలకమైంది. ప్రభుత్వం తరఫున శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించాం. ప్రధాని కరోనా వ్యాక్సిన్‌ తయారీ పరిశ్రమలను నేరుగా పరిశీలించారు. స్టార్టప్‌ కంపెనీల్లో భారత దేశం రెండో స్థానంలోఉంది. రక్షణ శాఖకు అవసరమైన ఎక్విప్‌?మెంట్‌ కూడా మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రతిరంగంపై సవిూక్ష చేసుకుంటున్నాం. యువత జనాభాలో దేశం నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. దేశ యువత తమ మేధో శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను ఇప్పటికే సైన్స్‌ సిటీగా ప్రకటించామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. సైన్స్‌ సిటీ కోసం 25 ఎకరాల స్థలం కావాలని రెండు సార్లు సీఎం కేసీఆర్‌?కు లెటర్‌ రాశానని.. కానీ ఆయన నుంచి ఇప్పటికీ ఎటువంటి రిప్లై రాలేదు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్‌?తో పాటు వరంగల్‌, రాజమండ్రిలలో కూడా సైన్స్‌ సిటీ యూనిట్స్‌ పెట్టనున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు.