భవిష్యత్‌ బుల్లెట్‌ శకం

– బుల్లెట్‌ రైళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జపాన్‌, భారత్‌ ప్రధానులు

అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి): అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించిన బుల్లెట్‌ ట్రైన్‌ కల సాకారం కాబోతున్నది. దానిని సాకారం చేసేందుకు తసీఉకున్న నిర్ణయంలో భాగంగా బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణానాకి తొలి అడుగు పడింది. కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సాంకేతిక యుగాన్ని అంది పుచ్చుకొని అగ్ర దేశాల సరసన నిలబడటానికి భారత్‌ తన వంతు కృషి చేస్తున్నది. అందులో భాగంగా దేశంలో తొలి సారిగా బుల్లెట్‌ రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. జపాన్‌ సాయంతో నిర్మించనున్న ఈ బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులకు గురువారం అంకురార్పణ జరిగింది. ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య ఈ రైలు నిర్మాణ పనులకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్‌ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌ లో శంకుస్థాపన చేశారు. ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య 508 కివిూలు ఈ రైలు మార్గాన్ని నిర్మించ నున్నారు. గతేడాది నవంబర్‌ లో మోదీ జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ బుల్లెట్‌ ట్రైన్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. 2018 లో బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జపాన్‌ ప్రధాని మాట్లాడుతూ శంకుస్థాపన లో నేను పాల్గొనడం ఆనందంగా ఉంది.. జపాన్‌-భారత్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.. ఇరు దేశాలు కలిసి పని చేస్తే సాధించలేనిది ఏవిూ ఉండదు.. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా జపాన్‌ ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ఇది నవభారతం.. ఎన్నో కలలు సాకారం చేసుకోవాలనుకుంటున్నది… రహదారులు, రవాణా వ్యవస్థ ద్వారా అభివృద్ధి సాధ్యం… రోడ్డు, విమాన, రైలు, జల రవాణా ద్వారా దేశం మొత్తం అనుసంధానం… అమెరికాలో కూడా రైల్వే వ్యవస్థ వచ్చాకే అభివృద్ధి చెందిందని ప్రధాని మోడీ అన్నారు. 1964 లోనే జపాన్‌ లో బుల్లెట్‌ రైలు పరుగులు తీసింది.. ఒకప్పుడు పేదరికంతో జపాన్‌ ఇబ్బందులు ఎదుర్కొంది… ఇప్పుడు ప్రపంచానికి జపాన్‌ ఆదర్శంగా నిలుస్తున్నది.. యూరప్‌ నుంచి చైనా వరకు అన్ని దేశాలు జపాన్‌ వైపు చూస్తున్నాయి.. హైస్పీడ్‌ రవాణా వ్యవస్థ ద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం సుగుమం.. హైస్పీడ్‌ అనుసంధానంతో ఉత్పాదకత పెంచాలన్నదే లక్ష్యం.. బుల్లెట్‌ రైలు కోసం భారత్‌ కు ఆర్థిక సాయం చేయడానికి జపాన్‌ ముందుకొచ్చిందని రూ. 88 వేల కోట్లు అతి స్వల్ప వడ్డీకి రుణం మంజూరు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందితేనే ఏ దేశమైనా ప్రగతి పథంలో దూసుకుని పోతుందన్నారు. హై స్పీడ్‌ రవాణా వ్యవస్థ ద్వారా ఆర్ధిక ప్రగతికి మార్గం సుగమమవుతుందన్నారు. అహ్మదాబాద్‌- ముంబై మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ మార్గం నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జపాన్‌ లాంటి మిత్ర దేశం భారత్‌ కు దొరకడం అదృష్టమన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

ప్రధానిది ఖరీదైన కల

ప్రధాని నరేంద్ర పనితీరుపై శివసేన మరోసారి ధ్వజమెత్తింది. మోదీ తన ఖరీదైన కలలకోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని సేనవ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌పై సేన విమర్శలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం అనసవరంగా 1.08 లక్షల కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చుపెడుతోందని శివసేన పేర్కొంది. మోదీ ఖరీదైన కలను నెరవేర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని విమర్శించింది. సాధారణ వ్యక్తి కోసం ప్రధాని కలలు కనడంలేదని.. అత్యంత సంపన్న, ధనిక, వ్యాపార వర్గాల కొసం మాత్రమే ఆయనన కలలు కంటున్నారని సేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ముంబైలో లోకల్‌ ట్రైన్‌ సిస్టమ్‌ చాలా అస్తవ్యస్తంగా.. అనేక సమస్యలతో నడుస్తోందని.. దీనిని ముందు సంస్కరిస్తే బాగుండేదని శివసేన పేర్కొంది. దీని కోసం పెట్టే పెట్టబడితో విదర్భ, కొంకణ్‌, మరఠ్వాడా ప్రాంతాల్లో అనేక రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని శివసేన సూచించింది.