భాజపా ఆధ్వర్యంలో ధర్నా
ఖమ్మం సంక్షేమం: హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్ల సంఘటనకు నిరసనగా భాజపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పార్టీ నుంచి మయూరి సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం వ్యాపార సంస్థలను మూసి వేసి ఆర్టీసీ బన్‌స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో భాజపా నాయకులు శ్రీధర్ రెడ్డి, విద్యసాగర్ తదితరులు పాల్గొన్నారు.