భానుడి భగభగకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. అత్యధికంగా రామగుండంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 44 డిగ్రీలు, నెల్లూరు, కడప జిల్లాల్లో 43 డిగ్రీలు, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.