భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం -గాంధారి

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 31
  కామరెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రంలో  సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాణాల లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ రేపు సాయంత్రం 4:00 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తెలుగింటి ఆడబిడ్డ శ్రీమతి నిర్మల సీతారామన్  వస్తున్నారు వారు సెప్టెంబర్ 01,02,03 తేదీలలో కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్యటిస్తారు 02 తేదీ నాడు బాన్సువాడలో పర్యటిస్తారు 03 తేదీ నాడు ఉదయం 10 గంటలకు గాంధారి మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హల్ లో రైతులతో ముఖాముఖి మాట్లాడుతారు కేంద్ర ప్రభుత్వం రైతులు  పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర సక్రమంగా అమలవుతుందా లేదా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి వాటిపై రైతులతో మాట్లాడడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సాయిబాబా, శ్రీకాంత్ రవి మధుసూదన్ గంగారెడ్డి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అన్ని గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు