భారతీయ నావికుల విడుదల
టెహ్రాన్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్ షిప్ స్టెనా ఇంపెరోలోని భారతీయ నావికులను విడుదల చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. గత జూలై నెలలో ఈ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) స్వాధీనం చేసుకుంది. నౌకలోని సిబ్బందితో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసవి చెప్పారు. చట్టాల ఉల్లంఘన కారణంగా నౌకను నిలువరించామని, సహజంగానే దాని సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన
అన్నారు. అయితే వారి వ్యక్తిగత పర్మిట్లు, కాన్సులార్ స్టేటస్ తదితర అంశాలను పరిశీలించిన తరువాత వారిని మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.