భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
` అందుకు ఇదే సరైన సమయం: మోదీ
` ఇండియా ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో మోదీ
పారిస్(జనంసాక్షి):2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. భారత్‌లో వ్యాపారాల పెరుగుదలకు ఆస్కారం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 14వ ఇండియా ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో మోదీ ప్రసంగించారు. ఈ సమావేశం ఇరుదేశాలకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమం అన్నారు. ’విూరంతా ఆవిష్కరణ, సహకార, సవిూకృత మంత్రంతో పనిచేయడం నేను చూస్తున్నా. విూరు భారత్` ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం బలోపేతం చేస్తున్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (ఇఎఎజీనిబీవశ్రీ ఓజీఞతీనీని)తో ఈ సమ్మిట్‌కు అధ్యక్షత వహించడం సంతోషకరంగా ఉంది. గత రెండేళ్లలో ఇది మా ఆరో సమావేశం. గతేడాది మా రిపబ్లిక్ డేకి మెక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేడు మేమిద్దరం కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించాం. గత దశాబ్దంలో భారత్‌లో జరిగిన మార్పులు విూకు తెలుసు. స్థిరమైన, ఊహాజనిత విధానానికి సంబంధించిన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటుచేశాం. త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. రక్షణరంగంలో ‘’మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’ని ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ఇక, మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. పారిస్‌లో మంగళవారం జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ కు అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి మోదీ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు. టెక్నాలజీ వల్ల పని అదృశ్యం కాదని, అది తన రూపాన్ని మార్చుకుంటుందని, కొత్తతరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చరిత్ర చెబుతోందన్నారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తోందని, ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తోందన్నారు. ఇదిలాఉండగా.. తదుపరి ఏఐ యాక్షన్ సదస్సును భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధమని మోదీ పేర్కొన్నారు. ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఏఐ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నామన్నారు.మరోవైపు.. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ అమెరికాకు చేరుకోనున్నారు. ఈసందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోదీ.. ఈసందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మార్సెయిల్‌లో భారత కాన్యులేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ
` ఫ్రాన్స్‌లో యుద్దవీరులకు ప్రధాని నివాళి
ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారంనాడు పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. దక్షిణ మార్సెయిల్‌లోని మజార్గ్యూస్ యుద్ధ శ్మశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు. ప్రధాని వెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా హాజరయ్యారు. మార్సెయిల్‌లో భారత కాన్యులేట్ కార్యాలయాన్ని కూడా మోదీ, మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. కాంటినెంటల్ ఫ్రాన్స్‌లో తొలి భారత రాయబార కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఇరుదేశాల మధ్య మరింత లోతైన సంబంధాలు ఏర్పడటంతో పాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు, మల్టీ డైమన్షయల్ రిలేషన్‌షిప్‌కు బలం చేకూరిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. దీనికి ముందు పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మాక్రాన్‌తో కలిసి సదస్సుకు మోద అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆదేశంలో మోదీ పర్యటించనుండటం ఇదే ప్రథమం.