భారత్‌పై ఓటమి: కోచ్‌ను దుర్భాషలాడిన పాక్ ఆటగాళ్లు
కరాచీ: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో ఓటమి ఇంకా పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తన పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారని పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి ఫిర్యాదు చేశారు ఈ సంఘటనను పిసిబి ఇంకా ధ్రువీకరించాల్సే ఉంది. షాహిద్ అఫ్రిదీ, అహ్మద్ షెహనాజ్, ఉమర్ అక్మల్ శిక్షణ సందర్భంగా మంగళవారంనాడు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని లూడనే పిసిబికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాను పదవి నుంచి తప్పుకుంటానని లూడెన్ పిసిబిని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఆటగాళ్లు తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన అన్నట్లు సమాచారం. భారత్‌పై ఓటమి: కోచ్‌ను దుర్భాషలాడిన పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ఆయన ఖాన్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఆ మెసేజ్ రాగాని పిసిబి చైర్మన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా, హెడ్ కోచ్ వాకర్ యూనిస్, లూడెన్‌లతో చర్చించినట్లు తెలుస్తోందని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. సమస్యను పరిష్కరిస్తానని, ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించకుండా చూస్తానని పిసిబి చైర్మన్ లూడెన్‌కు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. శిక్షణ కఠినంగా ఉండడంతో మ్యాచ్‌కు ముందే తాము ఆలసిపోతున్నామని ఆటగాళ్లు అంటున్నట్లు తెలుస్తోంది.