భారత్‌లో ఆడడం అంత సులభం కాదు

విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా

తిరువనంతపురం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 1-3తో కోల్పోవడంపై విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా స్పందించాడు. నలభై వేల మంది అభిమానులు స్టేడియాన్ని ¬రెత్తిస్తుంటే

అత్యుత్తమ జట్టుతో ఆడడం అంత సులభం కాదన్నాడు. తమ కుర్రాళ్లు చాలా తెలివైన వాళ్లని, కావాల్సినంత నైపుణ్యం ఉందని, అయితే, తొలి మూడు వన్డేలకే వారిలో ఇంధనం పూర్తిగా ఖర్చయిపోయిందని అన్నాడు. ఒత్తిడిని అధిగమించి ఆడడం నేర్చుకుంటే మరింత బాగా రాణిస్తాడన్నాడు.

పర్యటనలో భారత జట్టు నుంచి తాము చాలా నేర్చుకున్నట్టు చెప్పాడు. నేర్చుకోవడానికి ఇంత కంటే మంచి జట్టు ఉండదని లా అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మపై ప్రశంసలు కురిపించిన లా.. వారి బ్యాటింగ్‌ను చూడడం కంటే గొప్ప మరేవిూ ఉండదన్నాడు. బుమ్రా, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లనూ విండీస్‌ కోచ్‌ ప్రశంసించాడు. గెలడానికి నైపుణ్యం ఒక్కటే సరిపోదని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు కూడా గెలుపును ప్రభావితం చేస్తాయన్నాడు.