భారత్‌లో ఐఎస్ లేదు
– హోంమంత్రి రాజ్‌నాథ్
లక్నో,సెప్టెంబర్28(జనంసాక్షి): ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారింది కానీ.. భారత్ తప్పకుండా ఉగ్రవాదంపై విజయం సాధిస్తుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు భారత్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రాజనాథ్ ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. భారత్‌పై ఉగ్రవాదులు పట్టుసాధించే అంశాన్ని తోసిపుచ్చారు. భారత్లో అలాంటి వాటికి అవకాశం లేదన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐఎస్‌ఐఎస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. రాష్టాల్ల్రో ఉగ్రవాదం వ్యాపిస్తోందనే వార్తల్లో నిజం లేదని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా ప్రభుత్వం సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టడం చూస్తున్నామని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు ఆర్థిక, పాలనాపరమైన విషయాలు మాత్రమే పట్టించుకుంటాయని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్, బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాలను ఆయన ఉదాహరించారు.