భారత్‌లో కచేరీలు రద్దు: పాక్ గజల్ మేస్ట్రో

951న్యూఢిల్లీ: భారత రాజకీయాలు తనని తీవ్రంగా బాధించాయని, ఇకపై భవిష్యత్తులో భారత్‌లో ఎలాంటి సంగతీ కచేరీ కార్యక్రమాలను నిర్వహించబోనని పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను భారత్‌లో కచేరీ కార్యక్రమలాను నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ, లోక్నోలో నవంబర్ 25న ఒకటి, డిసెంబర్ 3న ఢిల్లీలో మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పుడు రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. తాను నిర్వహించే కచేరీలను అడ్డుకోవడం ద్వారా భారత్‌లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను బాధించిందని అందుకే ఈ నిర్ణయానికి వచ్చానన్నారు.  గులాం ఆలీ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్వాగతించారు. ఈ సందర్భంగా ‘గులాం అలీ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అలాగే, పాకిస్థాన్ కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ముందుకురావాలి. అని సలహా కూడా ఇచ్చారు. సరిహద్దులో ఉన్న భారత సైనికులతో సరిగా వ్యవహరించేవరకు గులాం ఇండియాలో అడుగుపెట్టవద్దని సూచించారు. భారత సైనికులను పాకిస్థాన్ చంపేస్తుందని ఆయన ఇప్పటికి అర్ధం చేసుకున్నందుకు పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. శివసేనకు భయపడి ఇప్పటికే ముంబై, పూణెలో నిర్వహించాల్సిన తన సంగతీ కచేరీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ, లక్నోలో నిర్వహించాల్సిన కచేరీ కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. 74ఏళ్ల గులాం అలీకు అటు పాకిస్థాన్, ఇటు ఇండియాలో పెద్ద ఎత్తున అభిమానులున్నారు.