భారత్‌లో కొత్త వేరియంట్లు లేవు

అధ్యయనంలో వెల్లడి
న్యూఢల్లీి,అగస్టు6( జనం సాక్షి): కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్‌సీవోవీ2 జీనోమిక్స్‌ కన్‌సోర్టిమ్‌(ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన డేటాను రిలీజ్‌ చేసింది. ఇండియాలో ప్రస్తుతం ఏ కరోనా వేరియంట్‌ విస్తృతంగా ఉందో ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ స్టడీ చేసింది. ఒమిక్రాన్‌తో పాటు దానికి చెందిన వేరియంట్లే ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు. ప్రస్తుతం ఇండియాలో మళ్లీ కోవిడ్‌19 కేసులు పెరుగుతున్నాయి. కానీ ఆ వైరస్‌ వల్ల హాస్పిటల్‌లో చేరుతున్నవారి సంఖ్య తగ్గింది. మరణాలు కూడా ఎక్కువగా లేవు. ప్రతి వారం డేటాను సవిూక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే కొత్త వేరియంట్లు ఏవిూ లేవని ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ వర్గాలు వెల్లడిరచాయి. సబ్‌ వేరియంట్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.