భారత్‌ అతిపెద్ద రక్షణ భాగస్వామి

 presidentobama-youtubeకొత్త అధ్యక్షుడి రాకతో వైట్‌హౌస్‌ను వీడనున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తిస్తూ ఆ దేశానికి అవసరమైన రక్షణ, సైనిక పరికరాలను ఉదారంగా సరఫరా చేయాలంటూ ట్రంప్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి ఒబామా ప్రభుత్వం ఎజెండా నిర్దేశించింది. అలాగే భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా సంయుక్త విన్యాసాలు నిర్వహించాలని సూచించింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ బాల్డ్‌విన్ కార్టర్ గురువారం భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పై విషయాలను చర్చించారు. భారత్‌కు రక్షణ పరమైన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు అమెరికా లైసెన్స్ నిబంధనలు ఖరారు చేసినట్టు పారికర్‌కు వివరించారు. భారత్‌ను అతిపెద్ద రక్షణ భాగస్వామ్య దేశంగా గుర్తిస్తూ అమెరికా గత జూన్‌లోనే నిర్ణయం తీసుకున్నట్టు కార్టర్ పేర్కొన్నారు.