భారత్ గెలుపు లాంఛనమే!
– విజయానికి రెండు వికెట్ల దూరంలో భారత్
బౌలర్ల దాటికి తేలిపోయిన ఆస్టేల్రియా బ్యాట్స్ మెన్
– రెండో ఇన్సింగ్స్ లో ఆస్టేల్రియా స్కోర్ 258/8
– మరో 141 పరుగుల ఆధిక్యంలో భారత్
ఆసిస్‌ను ఆదుకున్న కమిన్స్.. విజయానికి అడ్డుగా నిలిచిన బౌలర్
మెల్‌బోర్న్,డిసెంబర్29(జనంసాక్షి): మెల్‌బోర్న విజయానికి రెండు వికెట్ల దూరంలో కోహ్లీ సేన నిలిచింది. మరో రోజు విజయం కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు జరిగితే తప్ప విజయం ఖాయం కానుంది. శనివారం నాలుగోరోజే విజయం సాధించాలన్న భారత్ ఆశలపై ఆస్టేల్రియా బౌలర్ కమ్మిన్స్ నీళ్లు చల్లాడు. బంతితో సత్తా చాటి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన కమ్మిన్స్ తాజాగా బ్యాట్‌తోనూ మెరిశాడు. అజేయ అర్ధశతకం సాధించిన కమ్మిన్స్ 61పరుగులతో బ్యాటింగ్ చేస్తూ భారత్ విజయాన్ని మరో రోజుకు వాయిదా వేశాడు. దీంతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్టేల్రియా 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. మొత్తానికి ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ గెలుపు దాదాపు ఖరారైంది. ఆరంభం నుంచి టీమిండియా బౌలర్ల ధాటిగా బౌలింగ్ చేయడంతో ఆస్టేల్రియా బ్యాట్స్‌మెన్‌లు విలవిల్లాడారు. టాప్ బ్యాట్స్‌మెన్‌లుసైతం బౌలర్లు వేసిన చురుకైన బంతులకు
చేతులెత్తేశారు. ఫలితంగా 258 పరుగులకు ఆస్టేల్రియా ఎనిమిది వికెట్లు కోల్పోయింది.. ప్రస్తుతం టీమిండియా 141 పరుగులు ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా 54/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించింది. అయితే భారత బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల నష్టానికి 106పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 399పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పైన్ సేనను టీమిండియా బౌలర్లు ఆదిలోనే అడ్డుకున్నారు. షాన్ మార్ష్ (44), హెడ్ (34), ఖవాజా (33) చెప్పుకొదగ్గ పరుగులు చేశారు. కమ్మిన్స్ (61 బ్యాటింగ్), లియాన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. బుమ్రా, షవిూ రెండేసి, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు. అంతుకు ముందు 54/5 తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ (42), పంత్ (33) కీలక పరుగులు చేశారు. ఆస్టేల్రియా విజయానికి మరో 141 పరుగులు అవసరం. మరో రెండు వికెట్లు పడితే విజయం భారత్ సొంతం. మొత్తంగా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. చారిత్రక విజయానికి కోహ్లీ సేనకు కావాల్సింది మరో రెండు వికెట్లే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరిన తీరు చూస్తే నాలుగో రోజే టెస్టు పూర్తవుతుందని అనుకున్నారు. టాప్, మిడిలార్డర్లు విఫలమయినప్పటికీ టెయిలెండర్లు కుదురుకున్నారు. మరో 30 నిమిషాలు అట పొడిగించినప్పటికీ భారత్‌కు వికెట్లు మాత్రం చిక్కలేదు. జడేజా మూడు వికెట్లు, బుమ్రా, షవిూ చెరో రెండు వికెట్లు తీయగా ఇషాంత్ ఖాతాలో ఒక వికెట్ పడింది. దీంతో ఆతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 258 పరుగులు చేయగలింది. ప్రస్తుతం టీమిండియా 141 పరుగులు ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా 54/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించింది. అయితే భారత బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల నష్టానికి 106పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 399పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పైన్ సేనను టీమిండియా బౌలర్లు ఆదిలోనే అడ్డుకున్నారు. బుమ్రా వేసిన తొలిఓవర్ రెండో బంతికే ఓపెనర్ ఫించ్ కోహ్లీ చేతికి చిక్కాడు. తర్వాత మరో ఓపెనర్‌ను ఔట్ చేయడానికి టీమిండియాకు ఎంతో సమయం పట్టలేదు. 10వ ఓవర్లో జడేజా వేసిన బంతి మయాంక్ చేతికి చిక్కడంతో మార్కస్ హారిస్(13) పెవిలియన్ చేరాడు. క్రీజులో పాతుకుపోయి చాలా సేపటి వరకు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన షాన్ మార్ష్‌ను బుమ్రా బయటకు పంపాడు. 33వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి అర్ధ శతకానికి చేరువైన మార్ష్(44) ఎల్బీగా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లు 40 ఓవర్లకే ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కూల్చేశారు. టాప్ ఆర్డర్ కుదేలవ్వడంతో ఆసీస్ మిడిలార్డర్‌పై ఆధార పడాల్సి వచ్చింది. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న ట్రావిస్ హెడ్ కాసేపు బౌలర్లను తట్టుకుని నిలబడ్డాడు. భారీషాట్లు ఆడుతూ రెండు మూడు సార్లు బౌలర్ల దాడి నుంచి తప్పించుకున్న హెడ్ ఈసారి ఇషాంత్‌కు చిక్కాడు. 51వ ఓవర్లో ఇషాంత్ బౌలింగ్‌లో హెడ్(34) బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 157 మాత్రమే. ఇంకా 242 పరుగుల లక్ష్య ఛేదన ముందు ఉండటంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ తర్వాత మ్యాచ్ బాధ్యతను భుజాన వేసుకున్న ఆతిథ్య జట్టు సారథి టిమ్‌పైన్ ఆరంభంలో మెరుపులు మెరిపించాడు. అయితే వ్యక్తిగత స్కోరు 26 వద్ద పైన్ జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ భారం పూర్తిగా టెయిలెండర్ల విూద పడింది. మరో ఎండ్‌లో ఉన్న మిచెల్ స్టార్క్ సైతం
జట్టును ఆదుకోలేకపోయాడు. స్టార్క్ కూడా 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. 71 ఓవర్లో షవిూ వేసిన బంతికి స్టార్క్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మరో రెండు వికెట్లు మాత్రమే మిగిలి ఉండటంతో మరో 30 నిమిషాలు మ్యాచ్‌ను కొనసాగించాల్సిందిగా టీమిండియా అనుమతి కోరింది. అయితే అప్పటికి నాథన్ లైయన్, కమిన్స్ క్రీజులో పాతుకుపోయారు. నాలుగో రోజే మూడో టెస్టును ముగించాలన్న టీమిండియా కోరికకు గండి పడింది. ఈలోపు పాట్ కమిన్స్ అర్ధ శతకం పూర్తి చేసుకొని బౌండరీల మోత మోగించాడు. దీంతో నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 258పరుగులు చేసింది. పాట్ కమిన్స్(61; బ్యాటింగ్), నాథన్ లైయన్(6; బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.