భారత్‌ ఘోర పరాజయం

సిరీస్‌ సమం చేసిన ఇంగ్లాండ్‌

పిచ్‌పై నెపం వేసిన ధోని

ముంబయి, నవంబర్‌ 26 :రెండో టెస్టులో ఇంగ్లాండు 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 టెస్టుల సిరీస్‌ 1-1తో సమం. ఒకరోజు ముందుగానే భారత-ఇంగ్లాండు రెండో టెస్టు పోరుకు తెరపడింది. సోమవారం ఉదయం ఇంగ్లండు జట్టు విజయ లక్ష్యాన్ని 57పరుగులుగా భారత్‌ నిర్దేశించింది. సోమవారం ఉదయం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత జట్టు ఆలౌటవ్వడంతో ఇంగ్లాండు జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 57 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంగ్లాండ్‌ జట్టు కెప్టెన్‌ కుక్‌, కాంప్టన్‌ నడుం కట్టారు. 9.4 ఓవర్లలో కుక్‌ 18, కాంప్టన్‌ 30 పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాగా 10 పరుగులు జతయ్యాయి. విజయ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించారు.

తడబడ్డ భారత ఆటగాళ్లు..

రెండో టెస్టులో తడబడిన భారత ఆటగాళ్లు. రెండో ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే సోమవారం ఉదయానికి చేయగలిగారు.  తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేయడం విదితమే.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఇలా..

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. గంబీర్‌ మినహా టాప్‌ఆర్డర్‌ అంతా పరుగులు చేయడంలో విఫలమైంది. ఒపెనర్‌ గంబీర్‌ ఒక్కడే 65 పరుగులు చేసి స్వాన్‌ చేతిలో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. అతని ముందు నుంచి వరుసగా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌ దారి పట్టారు. అంతేగాక అవుటైన వారిలో 8మంది సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్‌ దారి పట్టారు. భారత బ్యాట్స్‌మెన్లు ఇలా స్కోరు చేశారు. సెహ్వాగ్‌ తన వ్యక్తిగత స్కోరు 9 పరుగుల వద్ద పనేసార్‌ బౌలింగ్‌లో స్వాన్‌కు దొరికిపోయాడు. చత్తేశ్వర్‌ పూజారా 6 పరుగుల వద్ద స్వాన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు చిక్కాడు. సచిన్‌ 8 పరుగుల వద్ద పనేసార్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.  కోహ్లి 7 పరుగుల వద్ద స్వాన్‌ బౌలింగ్‌లో తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. యువరాజ్‌సింగ్‌ 8 పరుగులు చేశాక పనేసార్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చాడు. ధోని 6 పరుగుల వద్ద పనేసార్‌ బౌలింగ్‌లో ట్రోట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్‌ 11 పరుగుల వద్ద పనేసార్‌ బౌలింగ్‌లో సమిత్‌ పటేల్‌కు దొరికిపోయాడు. హర్బజన్‌సింగ్‌ 6 పరుగుల వద్ద స్వాన్‌ బౌలింగ్‌లో ట్రోట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. జహీర్‌ఖాన్‌ ఒక్క పరుగు మాత్రమే చేశాక పనేసార్‌ బౌలింగ్‌లో ప్రయర్‌కు చిక్కాడు.  ఓజా 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఎక్స్‌ట్రాగా 9 పరుగులొచ్చాయి. మొత్తం 44.1 ఓవర్లకు గాను 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.  ఇదిలా ఉండగా పనేసార్‌ 6 వికెట్లు.. స్వాన్‌ 4 వికెట్లు తీసుకున్నారు.

ఇంగ్లండు బౌలింగ్‌ ఇలా..

అండర్‌సన్‌ 4 ఓవర్లు వేసి.. 9 పరుగులిచ్చాడు. పనేసార్‌ 22 ఓవర్లు వేసి 81 పరుగులిచ్చాడు. 6 వికెట్లు తీసుకున్నాడు. స్వాన్‌ 18.1 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంగ్లండు తొలి ఇన్నింగ్స్‌ ఇలా..

కుక్‌ 122 పరుగులు చేశాక అశ్విన్‌ బౌలింగ్‌లో ధోనికి చిక్కాడు. కాంప్టన్‌ 29 పరుగుల వద్ద ఓజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు దొరికిపోయాడు. ట్రోట్‌ పరుగులేమీ చేయకుండానే ఓజా చేతిలో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. బెయిర్‌స్టో ఓజా బౌలింగ్‌లో గంబీర్‌కు 9 పరుగుల వద్ద చిక్కి పెవిలియన్‌కు చేరాడు. పీటర్‌సన్‌ 186 పరుగులు చేశాడు. ఓజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చాడు. సమిత్‌ పటేల్‌ 26 పరుగుల వద్ద ఓజా బౌలింగ్‌లో కోహ్లికి చిక్కాడు. ప్రయర్‌ 21 పరుగుల వద్ద రనౌటయ్యాడు. బ్రాడ్‌ 6 పరుగులు చేశాక హర్బజన్‌ బౌలింగ్‌లో పూజారాకు దొరికిపోయాడు. అండర్‌సన్‌ 2 పరుగులు చేశాక హర్బజన్‌ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు. పనేసార్‌ 4 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో జహీర్‌ఖాన్‌కు చిక్కి పెవిలియన్‌కు చేరాడు. స్వాన్‌ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాగా ఏడు పరుగులు వచ్చాయి. 121.3 ఓవర్లకు గాను 10 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. భారత్‌ కంటే 86 పరుగుల ఆధిక్యతతో ఉంది.

భారత్‌ బౌలింగ్‌ ఇలా..

అశ్విన్‌ 42.3 ఓవర్లు వేసి 145 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఓజా 40 ఓవర్లు వేసి 143 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. జహీర్‌ఖాన్‌ 15 ఓవర్లకు 37 పరుగులు ఇచ్చాడు. హర్బజన్‌సింగ్‌ 21 ఓవర్లు వేసి 74 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. యువరాజ్‌సింగ్‌ 3 ఓవర్లు వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఇలా..

గంబీర్‌ 4, సెహ్వాగ్‌ 30, పూజారా 135, సచిన్‌ 8, కోహ్లి 19, యువరాజ్‌సింగ్‌ 0, ఎంఎస్‌ ధోని 29, రవిచంద్రన్‌ అశ్విన్‌ 68, హర్బజన్‌సింగ్‌ 21, జహీర్‌ఖాన్‌ 11 పరుగుల వద్ద అవుటయ్యారు. ఓజా నాటౌట్‌గా నిలిచాడు. 327 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌ ఇలా..

గంబీర్‌ 65, సెహ్వాగ్‌ 9, పూజారా 6, సచిన్‌ 8, కోహ్లి 7, యువరాజ్‌సింగ్‌ 8, ధోని 6, అశ్విన్‌ 11, హర్బజన్‌ 6, జహీర్‌ఖాన్‌ 1 పరుగుల వద్ద అవుటయ్యారు. ఓజా 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 142 పరుగులకు ఆలౌటైంది.