భారత్‌ తెరచిన పుస్తకం :ప్రధాని

బెర్లిన్‌: భారత్‌ తెరచిన పుస్తకమని.ఎన్నో సమస్యలున్నా ప్రజాస్వామ్య నిబందనలకు కట్టుబడే సమాజమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కోన్నారు. ‘మా దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోంది. స్వేచ్చకు,మానవ హక్కులకు ఎంతో గౌరవం ఉంది’ అన్నారు. పౌరహక్కులు,మానవహక్కుల ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే సమర్థ యంత్రాంగముందని చెప్పారు.’నిర్బయ’ ఉదంతం తమ ప్రజలను ఏకం చేసిందని, ఫలితంగా అలాంటి ఘాతుకాలను అరికట్టే చట్టం వచ్చిందన్నారు. ఆయన గురువారమిక్కడ జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో కలిసి మీడియాలో మాట్లాడారు. పేదరికం భారత్‌ ఎదుర్కోంటున్న పెద్ద సమస్య అన్నారు.