భారత్‌ పటిష్టమైన ప్రజాస్వామ్య దేశం

v7eqnpdlభారత్‌ పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా మారటానికి లోక్‌ తంత్ర్ జయప్రకాశ్ నారాయణ్‌ కృషియే కారణమన్నారు ప్రధాని మోడీ. ఎమర్జెన్సీ కాలంలో అందుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను ఐక్యం చేయటంలో జేపీ చాలా కష్టపడ్డారన్నారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ 113 వ జయంతి సందర్భంగా ప్రధాని సహా బీజేపీ అగ్రనేత ఎల్‌. కె అద్వానీ ఆయనకు నివాళ్లర్పించారు. జయప్రకాశ్ నారాయణ్‌ జయంతి లోక్‌ రక్షా దివస్‌ గా జరిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తినిచ్చిందని ప్రధాని చెప్పారు.